Anni kalambula nunna yehovani nenna dharambayo ఆన్ని కాలంబుల నున్న యోహోవాని న్నెన్నథరంబయో Online Lyrics List August 04, 2021 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 📖 , బేతాళ జాన్ ✍ 1 రాగం - (చాయ: ) తాళం - 123 అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నఁదరంబయో కన్న తండ్రి వన్నె కెక్కిన మోక్ష వాసాళి సన్నుతు లున్నతమై యుండ మున్నె నీకు ||నన్ని||నిన్నుఁ బ్రకటన సేయ నిఖిల లోకములను బన్నుగఁ జేసిన బలుఁడ వీవె ఉన్న లోకంబుల -నుడుగక కరుణా సం-పన్నతతో నేలు ప్రభుఁడ వీవె అన్ని జీవుల నెఱిఁగి యాహార మిచ్చుచు నున్న సర్వజ్ఞుం డవు నీవే ఎన్న శక్యముగాక ఉన్న లక్షణముల సన్నుతించుటకు నేఁ జాలుదునా ||యన్ని||పుట్టింప నీవంచుఁ బోషింప నీవంచుఁ గిట్టింప నీవంచు గీర్తింతును నట్టి పనికి మాలి నట్టి మానవుల చే పట్టి రక్షింపం బాధ్యుండ వంచు దట్టమైన కృపను దరిఁజేర్చ నాకిచ్చి పట్టయి నిలచియుండు ప్రభుఁడ వంచుఁ గట్టడచేఁ గడ ముట్టుదనుక నా పట్టుకొలఁది నిన్నుఁ బ్రస్తు తింతు ||నన్ని||కారుణ్యనిధి వీవు కఠినాత్ముఁడను నేను భూరి శుద్ధుఁడ వీవు పాపి నేను సార భాగ్యుడ వీవు జగతిలో నాకన్న దారిద్రుఁడే లేఁడు తరచి చూడ సార సద్గుణముల సంపన్నుఁడవు నీవు ఘోర దుర్గుణ సంచారి, నేను ఏ రీతి స్తుతియింతు నే రీతి సేవింతు నేర మెన్నక ప్రోవ నెర నమ్మితి ||నన్ని|| updata || Update || Jagan Share This: Facebook Twitter Pinterest Linkedin Whatsapp Whatsapp About Online Lyrics List పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం RELATED POSTS