రాజాధిరాజు ఉదయించెనే నిన్ను నన్ను Online Lyrics List January 14, 2024 Christmas ▤ , Phebe Gracy S M L రాజాధిరాజు ఉదయించెనే, నిన్ను నన్ను రక్షింప జన్మించెనే యూదుల రాజుగా జన్మించెనే పశుల తొట్టిలో పరుండ పెట్టెనే (2) సంతోషించి ఆరాధించుదాం, రండి సందడి చేసి ఆరాధించుదాం (2) కన్య మరియ గర్భమందున, ఇమ్మానియేలు జన్మించనే చీకటిలో ఉన్న మన జీవితాలకు, వెలుగును నింపుటకు ఉదయించెనే (2) సంతోషించి ఆరాధించుదాం, రండి సందడి చేసి ఆరాధించుదాం (2) దేవదూతలు వచ్చినారు, కాపరులకు శుభవార్త తెచ్చినారు బాల యేసుని పూజించుటకు, వెళ్ళినారు యేసుని మ్రొక్కినారు (2) సంతోషించి ఆరాధించుదాం, రండి సందడి చేసి ఆరాధించుదాం (2) లోక పాప భారము నీవు మోసావు, గొప్ప రక్షణను మాకిచ్చావు పరలోకవాసులుగా మమ్ము చేసావు నీ కొరకు బ్రతుకుటకు మమ్ము నిలిపావు (2) సంతోషించి ఆరాధించుదాం, రండి సందడి చేసి ఆరాధించుదాం (2) || రాజాధిరాజు || telugu only Share This: Facebook Twitter Pinterest Linkedin Whatsapp Whatsapp About Online Lyrics List పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం RELATED POSTS