నాకేమి కొదువ యింక యేసయ్యా నీ అండ నాతో నుండ - యేసయ్యా Online Lyrics List March 26, 2024 Devaraja Sthuthi 📀 , Jakki Devaraju ✍ నాకేమి కొదువ యింక - యేసయ్యా నీ అండ నాతో నుండ - యేసయ్యా నా కొండ కోటవు నీవే - యేసయ్యా కాపరివై కాచెదవు - ఊపిరివై నిండుగ నింపెదవు || నాకేమి కొదువ || వెండి బంగారములు వేయి కొండలు నీవే దండిగా ధాన్యమిచ్చే - ధర సంపదయు నీదే మహిమైశ్వర్యములో - మనుగడ చూపించి అక్కరలు తీర్చెదవు - నిక్కముగ నడిపెదవు || నాకేమి కొదువ || పక్షులను పోషించే - అక్షయుడ నీవుండ పుష్పాల తేజమిచ్చే - దక్షుడవు నీవుండ తక్షణము మొర వినెడి - రక్షకుడ నీవుండ క్షామ కాలమందైన క్షేమ - మిచ్చి నడి పెదవు || నాకేమి కొదువ || గాడాంధకారములో - గాలి తుఫానులలో నీనీడ చాటున - నిజముగా దాచెదవు చిరకాలము నేను నీతో నుండగా అరమర లేకయే నే కరములు చాపితివి || నాకేమి కొదువ || || Raajula || Share This: Facebook Twitter Pinterest Linkedin Whatsapp Whatsapp About Online Lyrics List పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం RELATED POSTS